ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు కేసు దర్యాప్తు చేస్తున్న - ఎస్సై దీకొండ రమేష్

 కుమరంభీమ్ ( ఆసిఫాబాద్ ) జిల్లా : రెబ్బెన క్రైం రెబ్బెన మండలంలోని గ్రామా సమీపంలోని రహదారి పై ఆదివారం రాత్రి ప్రమాదం లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఆసిఫాబాద్ పట్టణంలోని బ్రహ్మణవాడకు చెందిన జంజిర్ల తిరుపతి,  ఆయన సతీమణి మమత,  కుమారుడు ప్రచీత్,  కుమార్తె ప్రకర్షాలు కాగజ్ నగర్ మండలం ఈజ్ గాం ఆలయంలో మల్లన్న బోనాల పండుగకు హాజరయ్యారు. తిరిగి వారి కుటుంబ సభ్యులతో ద్విచక్ర వాహనం పై ఇంటికి వస్తున్న క్రమంలో కాగజ్ నగర్ క్రాసు రోడ్డు నుంచి ఎదురుగా వస్తున్న కారు వంకులం సమీపంలో ఢీ కొట్టింది.  ఈ ఘటన లో తిరుపతి,  ప్రచీత్ కుడి కాళ్లు నుజ్జునుజ్జుయ్యాయి.  ప్రకార్ష కాలుకు గాయం కాగా,  మమతకు దెబ్బలు తగిలాయి క్షతగాత్రులను వెంటనే కాగజ్ నగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  తీవ్ర గాయాలైన తిరుపతి,  ప్రచీత్ లను మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు.  ఈ విషయం పై రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ ను సంప్రదించగా కారు డ్రైవర్ అతివేగంగా,  అజాగ్రత్తగా నడపడంతో సంభవించిందని , డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.   ఎస్సై దీకొండ రమేష్  కేసును దర్యాప్తు చేస్తున్నారు.



పవర్ ఆఫ్ పోలీస్ మ్యాగజైన్ 


✍🏻 రిపోర్టర్  -  యం. వంశీకృష్ణ. ✍🏻


కుమరంభీమ్ ( ఆసిఫాబాద్ ) జిల్లా